New Update on 7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. 4% DA పెంపు
New Updates on 7th Pay Commission : ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. సర్కారు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
New Update on 7th Pay Commission: ఈ ఏడాది మొదటి డీఏ అందుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ద్వితీయార్థంలో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు వరుసగా తీపి కబుర్లు అందిస్తున్నాయి. డీఏ, డీఆర్‌లను పెంచే ప్రక్రియ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది.
రాష్ట్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతున్నట్లు ఒడిశా సర్కారు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని డీఏ ఉద్యోగుల, పెన్షనర్ల కరువు భత్యం గతంలో 38 శాతం ఉండగా.. 42 శాతానికి పెరిగింది. దాదాపు 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లలకు లబ్ధి చేకూరనుంది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. హర్యానా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ డీఏ నాలుగు శాతం పెరిగింది. పెంచిన డీఏ జనవరి 1ను నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగింది. దీంతో డీఏ 42 శాతానికి చేరింది. పెంచిన డీఏను జనవరి నెల నుంచి అమలు చేసింది. రెండో డీఏ కూడా 4 శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. మొత్తం డీఏ 46 శాతనికి చేరుతుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జులై 1వ తేదీ నుంచి ఉద్యోగులకు అమలు చేయనున్నారు. 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.
Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?
డీఏ పెంపుతో పాటు కొత్త పే కమిషన్ ఏర్పాటుపై కూడా చర్చ జరుగుతోంది. 7వ వేతన సంఘం తరువాత 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త వేతన సంఘ ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి.. కమిటీ సూచనల మేరకు 8వ వేతన సంఘం జీతభత్యాలు ఖరారు చేయనున్నారు.
Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook