7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై స్పష్టత
7th Pay Commission DA Hike News: ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. మే నెలకు సంబంధించిన ఇండెక్స్ డేటాతో ఈ విషయం స్పష్టమైంది.
7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మే నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా వచ్చేసింది. ఇందులో కూడా పెరుగుదల ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు ఖాయమైనట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఏఐసీపీఐ సూచీ ప్రకారం మే స్కోర్‌లో 0.50 పాయింట్లు పెరిగాయి. దీంతో డీఏ 4 శాతం పెరిగితే.. 46 శాతానికి చేరుకుంటుంది. ఉద్యోగుల డీఏను ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా నిర్ణయింస్తున్న విషయం తెలిసిందే.
మే నెలలో 0.50 పాయింట్లు పెరగడంతో డీఏ స్కోరు 45.58 శాతానికి చేరింది. ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఏప్రిల్‌లో నెలలో 134.02 ఉండగా.. ప్రస్తుతం 134.7 చేరుకుంది.జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాతో సంబంధం లేకుండానే డీఏ పెంపు దాదాపు 46 శాతానికి చేరింది. ప్రస్తుతం 42 శాతం డీఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేశారు. రెండో డీఏ ప్రకటన కూడా ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. గత ఐదు నెలల ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాను పరిశీలిస్తే.. ఫిబ్రవరి నెల మినహా ప్రతి నెలలోనూ కొంత పెరుగుదల ఉంది.
జనవరి నెలలో ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా 132.8 పాయింట్లకు చేరుకోగా.. డీఏ 43.08 శాతమైంది. ఫిబ్రవరి 132.7 పాయింట్లు తగ్గినా.. డీఏ శాతం (43.79) పెరిగింది. మార్చి 133.3 పాయింట్లో డీఏ 44.46 శాతానికి చేరింది. ఏప్రిల్ నెలలో ఇండెక్స్ డేటా 134.2 పాయింట్లకు చేరుకోగా.. డీఏ 45.04 శాతం పెరిగింది. తాజాగా మే నెలలో 134.7 పాయింట్లకు పెరగడంతో డీఏ 45.58 శాతానికి చేరింది. జూన్ నెలలో కూడా ఇదే పెరుగుదల ఉండే అవకాశం ఉండడంతో డీఏ 46 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: West Indies Team: పసికూనల చేతిలో పరాజయం.. వరల్డ్ కప్ రేసు నుంచి విండీస్ ఔట్
Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి