8th Pay Commission Date in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ప్రతి పదేళ్లకోసారి ఏర్పడే కొత్త వేతన సంఘం ఇప్పుుడు ఏర్పడితే అమల్లో వచ్చేందుకు కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్లు పడుతుంది. కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రకటన రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఉండవచ్చని ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ప్రకటన జారీ కావచ్చు. 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ గణనీయంగా పెరగనున్నాయి. అందుకే దాదాపు కోటిమందికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. అందరికీ ఇప్పుడు గుడ్‌న్యూస్, త్వరలోనే కొత్త వేతన సంఘం ప్రకటన రావచ్చు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుంచి అమల్లోకి రావచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగులు, పెన్షనర్లు జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో చెక్ చేద్దాం.


కొత్త వేతన సంఘంతో జీతం ఎంత పెరుగుతుందంటే


ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. 2026తో గడువు పూర్తవుతుంది. ఆ తరువాత కొత్త వేతన సంఘం అమల్లోకి రావాలి. అందుకే వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో 8వ వేతన సంఘం ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 34,500 రూపాయలకుపెరగనుంది. అంటే ఏకంగా 186 శాతం పెంపు కన్పిస్తుంది. కొత్త వేతన సంఘం ప్రకారం జీతం 2.86 రెట్లు పెంచాలనేది ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదన. అంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉండాలి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరల్ని ఎదుర్కొనేందుకు జీతాల పెంపు ఒక్కటే ప్రత్యామ్నాయం. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతముంది. దాంతో అప్పట్లో కనీస వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. 


8వ వేతన సంఘం ఏర్పడితే కేవలం ఉద్యోగుల జీతాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్లు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ 9 వేలుంది. ఇది కాస్తా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతానికి చేరుకుంటే 25,740 రూపాయలు అవుతుంది. జీతభత్యాలు లేదా పెన్షన్ పెంపు అనేది కనీస వేతనం పెన్షన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే జీతభత్యాలు పెరుగుతాయో డీఏ కూడా పెరగనుంది. ఫలితంగా భారీగా జీతం చేతికి అందనుంది.


Also read: Vitamin B12 Veg Foods: విటమిన్ బి12 లోపం తీర్చే 5 బెస్ట్ శాకాహార పదార్ధాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.