8th Pay Commission DA Updates: డీఏపై వేతన సంఘం ప్రభావం, భారీగా పెరగనున్న కనీన వేతనం

8th Pay Commission DA Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా డియర్‌నెస్ అలవెన్స్‌పై స్పష్టమైన ప్రభావం పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission DA Updates: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన తరువాత జీతభత్యాల్లో కలిగే మార్పుల గురించి ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. డీఏ లెక్కింపు కొత్తగా ప్రారంభం కానుంది. ఇది ఉద్యోగుల జీతభత్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పరిశీలిద్దాం.
త్వరలో 8వ వేతన సంఘం కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త వేతన విధానంపై చర్చ జరగనుంది. జీతభత్యాల పెంపు, అలవెన్సులపై సమీక్ష ఉంటుంది. వేతన సంఘం సిఫార్సుల మేరకు కొత్త వేతన విధానం నిర్ణయిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా డీఏపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం 53 శాతం ఉన్న డీఏ వచ్చే ఏడాది జనవరి నాటికి 63 శాతం కానుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే డీఏ లెక్కింపు కొత్తగా జీరో నుంచి మొదలవుతుంది. అంటే అప్పటి వరకూ ఉన్న 63 శాతం డీఏ కనీస వేతనంలో కలిసిపోతుంది. దాంతో కనీస వేతనం భారీగా పెరగనుంది. వాస్తవానికి డీఏ 50 శాతం దాటితే కనీస వేతనంలో కలిపి తిరిగి సున్నా నుంచి లెక్కించాలనే ప్రతిపాదన ఉన్నా అది అమలు కాలేదు.
అయితే ఇప్పుడు కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం డీఏ మొత్తం కనీస వేతనంలో కలిపి కొత్తగా సున్నా నుంచి లెక్కించడం ప్రారంభిస్తారు. లేదా కేవలం 50 శాతం డీఏను కనీస వేతనంలో కలిపి మిగిలిన 13 శాతం నుంచి డీఏ గణించవచ్చు. దీనిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే డియర్‌నెస్ అలవెన్స్ కనీస వేతనంలో కలుస్తుంది. ఫలితంగా జీతం భారీగా పెరుగుతుంది. ప్రతి ఏటా రెండు సార్లు పెంచే డీఏ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం కనీస వేతనం 18 వేలున్న ఉద్యోగులకు 50 శాతం డీఏను కలిపే ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే 9 వేల రూపాయలు పెరుగుతాయి. అంటే కనీస వేతనం 18 వేల నుంచి 27 వేలు అవుతుంది.
కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడినా అప్పటి వరకూ ఉన్న డీఏను కనీస వేతనంలో కలిపి సున్నా నుంచి తిరిగి లెక్కించడం ఎప్పట్నించో జరుగుతున్నదే. డీఏ 100 శాతానికి చేరుకున్నా కనీస వేతనంలో కలపాల్సిందే. కానీ ఆర్ధిక పరిస్థితుల్ని బట్టి అది అమలు కావడం లేదు. 2016 కంటే ముందు 7 వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు డీఏ 187 శాతం ఉండేది. ఇదంతా కనీస వేతనంలో కలిసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి