8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. 2016తో ఈ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. ఫలితంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతం , డీఏతో పాటు పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది. మరి ఈ కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడనుందో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 7వ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు లభిస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరిగింది. అటు పెన్షనర్లకు డీఆర్ కూడా 3 శాతం పెరిగింది. ఈ సమయంలో 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అయితే 8వ వేతన సంఘం ఎప్పుడనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకూ జారీ కాలేదు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చని సమాచారం అందుతోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగుల బేసిక్ శాలరీ 186 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. అంటే దాదాపుగా రెండు రెట్లు కావచ్చు. 


7వ వేతన సంఘం గడువు 2016తో పూర్తి కానుంది. అందుకే ఇప్పుడు కొత్త వేతన సంఘం ఏర్పడితే అమల్లోకి వచ్చేసరికి 2016 కావచ్చు. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం 18 వేల రూపాయలు అందుతోంది. 7వ వేతన సంఘంతో 6 వేలు పెరిగింది. 8వ వేతన సంఘం ఏర్పడితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 కానుంది. ఇది 29 పాయింట్లు పెరుగతుందని అంచనా ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతంగా నిర్ణయిస్తే ఉద్యోగుల జీతం 186 శాతం పెరగనుంది. అంటే ఉద్యోగుల జీతం 51,480 రూపాయలవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే పెరుగుతుందో పెన్షనర్లకు సైతం ప్రయోజనం కలగనుంది. పెన్షన్ 9 వేల నుంచి 25,740 రూపాయలు కానుంది. అంటే పెన్షన్ కూడా దాదాపుగా రెండు రెట్లు పెరగనుంది.


8వ వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన లేదు. 2-25-26 బడ్జెట్ సమావేశాల్లో ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7 వ వేతన సంఘం 2014 ఫిబ్రవరి నెలలో ఏర్పడగా 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పట్లో 7 వేల రూపాయలున్న బేసిక్ శాలరీ 18 వేలకు పెరిగింది. అందుకే ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. జీతభత్యాలు దాదాపుగా రెండు రెట్లు పెరగవచ్చు. 


Also read: New Ration Cards: ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇలా అప్లై చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.