Kerala Bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలక్కాడ్ జిల్లాలోని (Palakkad district) వడక్కంచెరి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సును టూరిస్ట్ బస్సు ఢీకొనడంతో (Bus Accident) 9 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు, టీచర్లు ఓ టూరిస్ట్ బస్సులో ఊటీకి వెళ్తున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత టూరిస్ట్ బస్సు కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో వడక్కంచేరి వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు కొట్టరక్కర నుంచి కోయంబత్తూర్కు 49 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. కింద పడ్డ ఆర్టీసీ బస్సును క్రేన్ సహాయంతో సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది వాహనంలోకి ప్రవేశించి ప్యాసింజర్స్ ను బయటకు తీశారు.


Also Read: Jalpaiguri Floods: దుర్గా దేవి నిమజ్జనంలో అపశృతి.. ఉప్పొంగిన నది వరదల్లో ఏడుగురు మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి