బస్సు లోయలో పడి 9 మంది మృతి !
బస్సు లోయలో పడి 9 మంది మృతి !
సిర్మౌర్: కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య కాలువలో ఓ బస్సు పడిన ఘటనలో 30 మంది వరకు చనిపోయిన దుర్ఘటన జరిగి ఒక్క రోజు కూడా గడవక ముందే ఇవాళ అటువంటి ఘటనే మరొకటి హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందిన దుర్ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా దదహుకు సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రత్యక్షసాక్షులు వెల్లడించిన వివరాల మేరకు మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.