Farmer Schemes in India by PM Modi Govt: రెండు దఫాలుగా అధికారానికి దూరంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. 2014లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేస్తూ.. నరేంద్ర మోదీ చరీష్మాతో బీజేపీ విజయం సాధించింది. 26 మే 2014న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ పాలనకు మెచ్చిన దేశ ప్రజలు 2019లో మరోసారి ఎన్డీయే కూటమికే అధికారం కట్టబెట్టారు. 2019 మే నెలలో రెండోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ తన తొమ్మిదేళ్లలో పరిపాలన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రైతుల ఆర్థికాభివృద్ధికి చేయూతనందించారు. ఈ 9 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అన్నదాతల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..
 
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో ఏడాదికి రూ.6 వేలు జమ చేస్తోంది. వాయిదాకు రెండు వేలు చొప్పున అందజేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 13 వాయిదాలలో అన్నదాతలు డబ్బు అందుకున్నారు. ఈ పథకం ప్రారంభంలో 2 హెక్టార్ల వరకు భూమిని ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే అందజేశారు. ఆ తరువాత భూమి ఉన్న రైతులందరికీ వర్తించేలా మార్పులు చేశారు.  ఈ పథకం కింద 8 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. 


ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన


ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన 2016లో ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రీమియం ఆధారిత పథకం. ఊహించని విపత్తులతో అన్నదాతలు నష్టపోతే రైతులను ఆర్థికం ఆదుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దీని కింద రైతులు ఖరీఫ్ 2%, రబీ 1.5%,  నూనెగింజల పంటలు, వార్షిక వాణిజ్య/ఉద్యాన పంటలకు 5% అతి తక్కువ ప్రీమియంతో పంట నష్టాలను కవర్ చేస్తాయి. ప్రీమియం సబ్సిడీ లోబడి పంట పండిన రెండు నెలలలోపు క్లెయిమ్‌లను పరిష్కరించాలని నిబంధనలు రూపొందించింది.


Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్


నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) పథకం


నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (e-NAM)ని ఏప్రిల్ 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. e-NAM పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చిన్న రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం (SFAC) ద్వారా అమలు అవుతోంది. e-NAM ప్లాట్‌ఫారమ్ ఆన్‌లైన్ పోటీ, పారదర్శక ధరల ఆవిష్కరణ వ్యవస్థ, ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి మెరుగైన మార్కెటింగ్ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (e-NAM) పాన్-ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఇది వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించడానికి ప్రస్తుత వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (APMC) మండీలను నెట్‌వర్క్ చేస్తుంది.


ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన 


ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ ద్వారా సామాజిక భద్రతను అందిస్తుంది. ఈ పథకం కింద కనీస ఫిక్స్‌డ్ పెన్షన్ రూ.3 వేలు. అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు కొన్ని మినహాయింపు నిబంధనలకు లోబడి 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పెన్షన్ అందజేస్తారు. ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య లబ్ధిదారుడు పెన్షన్ ఫండ్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడం ద్వారా స్కీమ్‌లో సభ్యుడిగా చేరవచ్చు. ఈ పథకాలే కాకుండా ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన స్కీమ్‌ను కూడా కేంద్రం ప్రారంభించింది.


Also Read: Google New Rules: లోన్‌ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు.. కొత్త నిబంధనలు ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి