కర్నాటకలో ( Karnataka ) కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడి పెట్టిన చేసిన అభ్యంతర పోస్టు బెంగుళూరులో విధ్వంసం సృష్టించింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడి..అల్లర్లు చెలరేగాయి. ఈ నేపధ్యంలో  డీజే హళ్లిలోని ( DJ Halli ) ఓ ఆలయాన్ని రక్షించేందుకు ముస్లిం యువకులు మానవహారం నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అఖండ శ్రీనివాసమూర్తి ( Congress MLA srinvas murthy ) మేనల్లుడు ఇస్లాం మత ప్రవక్త మొహమ్మద్ ( Prophet mohammad in Islam ) పై అభ్యంతరకర పోస్టు చేయడం పెద్దఎత్తున వివాదానికి కారణమైంది. ఈ పోస్టుకు ఆగ్రహించిన ఓ వర్గం ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడమే కాకుండా...ఇంటికి నిప్పు పెట్టింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. బెంగుళూరు నగరంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు ( Arsons in bengaluru ) చెలరేగాయి. పోలీసుల వాహనాలు నిప్పుకు ఆహుతయ్యాయి. రంగంలో దిగిన పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. దాదాపు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 


ఈ నేపధ్యంలోనే నగరంలోని డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. డీజే హళ్లిలోని ఓ ఆలయాన్ని దుండగుల నుంచి కాపాడేందుకు ముస్లిం యువకులు కొంతమంది గుడి చుట్టూ మానవహారం ( Human chain around a temple ) నిర్మించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ ముస్లిం భాయీ భాయీ సందేశంతో పాటు మత సామరస్యదతను చాటుతోంది. అందుకే నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.




 


కాగా..వివాదాస్పద పోస్టుతో ఘర్షణకు కారణమైన ఎమ్మెల్యే మేనల్లుడు నవీన్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నగరంలో ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ పోలీసులు 110 మందిని అరెస్టు చేశారు.