Oxygen Tanker: ప్రాణవాయువు విలువ తెలుస్తోంది. ఆక్సిజన్ లేక కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే విలవిల్లాడుతోంది. సమయానికి ఆ ఆక్సిజన్ ట్యాంకర్ రాకుంటే..వందకు పైగా ప్రాణాలు కాలిలో కలిసేవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశమంతా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పంజా విసురుతోంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రాణాలు పోతున్నాయి. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. ఓ వైపు బెడ్స్ కొరత మరోవైపు మందుల కొరత. అన్నింటికీ మించి ఆక్సిజన్ కొరతతో(Oxygen Shortage) రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ( Saroj Hospital)లో పెను ప్రమాదమే తప్పింది. ఆసుపత్రి యాజమాన్యం ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వందకు పైగా ప్రాణాలు పోయేవి. మరో జైపూర్ గోల్డెన్ ( Jaipur Golden Hospital) ఆసుపత్రి లేదా గంగారామ్ ఆసుపత్రి ఘటన పునరావృతమయ్యేది. ఈ ఆసుపత్రిలో వందకు పైగా రోగులు కరోనా వైద్యం చేయించుకుంటూ..ఆక్సిజన్ సిలెండర్లపై ఆధారపడి ఉన్నారు.


ఇంతలో ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడాలేవని గమనించిన సిబ్బంది ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారమిచ్చారు. కరోనా పరిస్థితుల నేపధ్యంలో బయటెక్కడా ఆక్సిజన్ సిలెండర్లు (Oxygen cylinders) లభ్యం కావడం లేదు. కళ్ల ముందు గోల్డెన్ ఆసుపత్రి ఘటన కన్పిస్తోంది. ఆ భయాందోళన నేపధ్యంలో ఆసుపత్రిలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గంటల తరబడి సిలెండర్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి..చివరికి ప్రభుత్వ, పోలీసుల సహాయంతో ఆక్సిజన్ ట్యాంకర్ (Oxygen Tanker) ఏర్పాటైంది. తీరా ట్యాంకర్ ఏర్పాటయ్యాక మరో సమస్య ఎదురైంది. ఆసుపత్రికి చెందిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్ ఉన్న ప్రాంతానికి ట్యాంకర్ రాలేకపోయింది. కారణం ఈ ప్రాంతం ఇరుగ్గా ఉండటమే. దాంతో గోడ భాగాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించారు. చివరికి అన్ని అడ్డంకుల్ని దాటుకుని ట్యాంకర్‌ను లోనికి చేర్చగలిగారు. వందకు పైగా రోగుల ప్రాణాల్ని కాపాడగలిగారు. ఆ ఆక్సిజన్ ట్యాంకర్ ఏర్పాటు ఆలస్యమైతే వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. 


Also read: COVID-19 Vaccines: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 50 శాతం డోసులు ఫ్రీ: Harsh Vardhan స్పష్టత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook