మహారాష్ట్రలోని పుణేలోని సంగ్వీ చౌక్ వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కారు అతి వేగంగా వచ్చి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. స్పీడ్ బ్రేకర్ వచ్చినా.. డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో స్పీడ్‌ బ్రేకర్‌ను ఢీకొన్న ఎస్‌యూవీ, రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరితో పాటు వాహన డ్రైవర్‌ కూడా గాయపడ్డాడని పోలీసులు చెప్పారు.