Free Aadhaar Update on Uidai.gov.in: ఫ్రీగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జూన్ 14లోగా మై ఆధార్ పోర్టల్లో ఉచితంగా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, లింగం, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ వంటివి ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఫొటో, ఐరిస్, బయోమెట్రిక్ వివరాల కోసం ఆధార్ సెంటర్‌లో రూ.50 ఫీజు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధార్ కార్డులు జారీ చేసి పదేళ్లు పూర్తియింది. గత పదేళ్లుగా చాలామంది ఆధార్‌ కార్డులో ఎలాంటి అప్‌డేట్ చేయలేదు. తమ చిరునామాలు మారినా.. ఆధార్‌లో మాత్రం పాత అడ్రస్‌లనే కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఆధార్ కార్డు అప్‌డేట్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌ ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. https://myaadhaar.uidai.gov.in లో ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాలలో అయితే..  రూ.50 ఛార్జీ చెల్లించడం తప్పనిసరి. myAadhaar పోర్టల్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా బుధవారంలోపు మాత్రమే.


ఆధార్ అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే..?


==> https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి
==> 'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి
==> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి
==> ఆ తరువాత మీరు 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయండి
==> ఇక్కడ ఏదైనా అప్‌డేట్ చేయాలనుకుంటే చేసుకోండి 
==> చివరగా 'సబ్మిట్' బటన్‌ను క్లిక్ చేయండి. సంబంధింత పత్రాలను అప్‌డేట్ చేయడానికి ఆ కాపీలను అప్‌లోడ్ చేయండి.
==> ఆధార్ అప్‌డేట్ రిక్వెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత మీకు 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) మీకు వస్తుంది
==> ఈ నంబరు ద్వారా మీరు ఆధార్ అడ్రస్ అప్‌డేట్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు.  
==> అప్‌డేట్ అయిననట్లు మీకు మొబైల్ నంబరుకు మెసేజ్ వచ్చిన తరువాత ఆన్‌లైన్‌లో మీ నూతన ఆధార్ కార్డును డౌన్‌లోన్ చేసుకోండి.


Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు  


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook