జీవిత బీమాకూ ఆధార్ అత్యవసరమే..!
నిన్న మొన్నటి వరకు గ్యాస్ సబ్సిడీ పొందడం దగ్గర నుండీ బ్యాంకు ఖాతాలు తెరవడం వరకూ ఆధార్ కార్డు అవసరమే అన్ని చెప్పిన ప్రభుత్వ సంస్థలు.. ఇప్పుడు తాజాగా ఆ నియమాన్ని బీమా రంగానికి కూడా వర్తింవజేశాయి. ఇకపై జీవిత బీమా పాలసీ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు నకలు ఇవ్వాల్సిందే. ఆ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే. ఇదే విషయాన్ని తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) తేటతెల్లం చేసింది. ఇప్పటికే బీమా పాలసీ ఉన్నవాళ్లతో పాటు తాజాగా బీమా పాలసీ తీసుకొనే వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జూన్ 1, 2017 ప్రకారం దాదాపు 60 ఆర్థిక సేవలకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని పేర్కొనబడింది. ఆ సేవారంగంలో బీమారంగం కూడా ఉండడంతో తప్పనిసరిగా ఆధార్‌ను పాలసీలతో అనుసంధానం చేసుకోవాలని ఐఆర్‌డీఏ తెలిపింది.