Aadhar Card Update Last Date: మనం మనతో పెట్టుకోవాల్సిన కార్డులో అత్యంత ముఖ్యమైనది ఆధార్ కార్డ్. అలాంటి ఆధార్ కార్డులో తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కాగా ఆధార్ కార్డులో ఏదైనా తప్పులుంటే దానిని ఫ్రీ గా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గతంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయని వ్యక్తులకు లైఫ్‌లైన్‌ని అందిస్తూ, ఆధార్ కార్డులను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ అప్డేట్ కి చివరి తేదీని మరోసారి పొడిగించారు.


ఈ గడువు 2023, డిసెంబర్ తో ముగియనుండగా.. ఇప్పుడు దానిని మరో 3 నెలలు పొడిగించింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త గడువు మార్చి 14, 2024గా నిర్ణయించబడింది.


కావున ఇప్పుడు 2024, మార్చి 14 వరకు ఆధార్ కార్డులో ఏది అప్‌డేట్ చేసుకోవాలన్నా ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదు. వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ మూడు నెలలలో, ఆధార్ కార్డ్ వినియోగదారులు తమ చిరునామా.., అలాగే వారి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఫోటో.. బయోమెట్రిక్ వివరాలకు.. ఎటువంటి ఖర్చు లేకుండా మార్పులు చేసుకోవచ్చు. అయితే తమ వివరాలు మార్చుకోవాలి అనుకునేవారు ఈ ప్రక్రియ సమయంలో తమ గుర్తింపు రుజువు (POI).. చిరునామా రుజువు (POA)ను ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది.


ఉచితంగా ఆధార్ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.in పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే నేరుగా కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) వెళ్లి ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ కు ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మీ ఫోన్ నెంబర్ ని మీ దగ్గరే ఉంచుకోవాలి. ఆ ఫోన్ నెంబర్ కి వచ్చే ఓటీపీ ద్వారా ఆధార్ కార్డులో తగిన మార్పులు చేసుకోవచ్చు.


Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు


Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook