AAP as National Party: ఆప్‌కు అరుదైన గుర్తింపు, ఇక ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ
AAP as National Party: ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీకు నేషనల్ పార్టీ హాదా వచ్చేసింది. ఆప్ ఇప్పుడు ఆ గౌరవం దక్కించుకుంది.
దేశ రాజధాని ఢిల్లీని వరుసగా మూడోసారి ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్ర పగ్గాలు దక్కించుకున్న ఆ పార్టీకు ఇప్పుడు నేషనల్ స్టేటస్ లభించింది. ఆ వివరాలు మీ కోసం..
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ తరువాత ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీకు ఆశించిన ఫలితాలు దక్కకపోయినా..జాతీయ పార్టీ హోదా మాత్రం లభించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ఆ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. జాతీయ పార్టీ హోదాకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు గెల్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 13 శాతం ఓట్లను దక్కించుకుంది. ఒక రాజకీయ పార్టీకు జాతీయో హోదా దక్కేందుకు 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 శాతం లేదా 6 శాతం సీట్లు లభిస్తే..కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకోగా, గోవాలో రెండు అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో 4 స్థానాలు గెల్చుకోవడమే కాకుండా..13 శాతం ఓట్లు సాధించడంతో జాతీయ పార్టీ హోదా అనివార్యమైంది.
ప్రస్తుతం దేశంలో 8 పార్టీలకు జాతీయ పార్టీ హోదా ఉంది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. గుజరాత్ ఎన్నికలతో ఇప్పుడు ఆప్ జాతీయ పార్టీ హోదా సాధించిన 9వ పార్టీగా నిలిచింది.
Also read: Himachal pradesh Results: హిమాచల్‌లో కొనసాగిన సాంప్రదాయం, అధికారం కాంగ్రెస్ పరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook