న్యూ ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 11న వెలువడనున్నాయి. ఫిబ్రవరి 8న అసెంబ్లీ 70 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఓటరు నాడి ఏంటన్నది ఎన్నికలు జరిగిన రోజే దాదాపుగా తేలిపోయింది. అన్ని ప్రధాన సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి సీఎం కానున్నారని అంచనా వేశాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే సీట్లు తగ్గినా.. భారీ మెజార్టీతోనే ఆప్ అధికారంలోకి మరోసారి రానుందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఢిల్లీ పీఠం మళ్ళీ ఆప్ దే.. : ఎగ్జిట్ పోల్స్


ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ భార్య, కాంగ్రెస్ ఎంపీ ప్రినీత్ కౌర్ ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు.  తమ పార్టీకి ఢిల్లీలో ఏమాత్రం ప్రయోజనకంగా లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విదేశాంగశాఖ మాజీ మంత్రి ప్రినీత్ కౌర్ చెప్పారు. తమ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కూడా కలిసి రాలేదన్నారు. మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను కొట్టిపారేస్తున్నారు.


Also Read: కొన్ని గంటల్లో ఢిల్లీ ఎన్నికలు.. మహిళా ఎస్ఐ దారుణహత్య


కాగా, ముచ్చటగా మూడోసారి ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పోలింగ్ రోజు కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మూడింట రెండోంతుల మెజార్టీతో అధికార ఆప్ మరోసారి విజయకేతనం ఎగరవేయడం ఖాయమనిస్తోంది. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల కీలక నేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. ఓటర్లు ఆప్ గత ఐదేళ్ల పాలనకే జై కొట్టినట్లు  కనిపిస్తోంది. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..