AAP Announces 300 Units Free electricity To Every Punjab Home: పంజాబ్‌ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం (AAP government) గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుండి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ ధృవీకరించింది. పంజాబ్‌లో భగవంత్ మాన్ (CM  Bhagwant Mann) నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఏర్పడి నేటికి నెల రోజులు అయిన సందర్భంగా ఆప్ సర్కారు ఈ ప్రకటన చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free electricity ) అందించడం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒకటి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఆప్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అందుకే ఇవాళ ఉచిత విద్యుత్‌పై ప్రకటన చేశారు. 


ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్‌ను అమల్లోకి తెస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.  అంతకుముందు మార్చి 19న, సీఎం భగవంత్ మాన్, తన మొదటి క్యాబినెట్ సమావేశంలో 25వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Pumjab Assembly elections 2022) ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 92 స్థానాల్లో గెలుపొందింది. 


Also Read: Petrol Price: అక్కడ కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్... గుంపులుగా ఎగబడ్డ జనం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook