Aayushi Chaudhary Murder Case: వీడిన ఆయూషి చౌదరి మర్డర్ మిస్టరీ.. కిల్లర్స్ ఎవరో కాదు..
Aayushi Chaudhary Murder Case Mystery: ఉదయం ఈ ఘటన జరగ్గా మధ్యాహ్నం డెడ్ బాడీని సూటుకేసులో ప్యాక్ చేసి పెట్టాడు. ఆర్థరాత్రి 3 దాటాకా కారులో శవాన్ని తీసుకెళ్లి తెల్లవారు జామున 5 గంటలకు ఎవ్వరూ చూడని సమయం చూసి యమునా ఎక్స్‌ప్రెస్ వే పడేసి వచ్చారు.
Aayushi Chaudhary Murder Case Mystery: శ్రద్ధా వాకర్ హత్యకు గురైన తరువాత కొద్ది రోజులకే వెలుగు చూసిన ఘటన ఆయుషి చౌదరి మర్డర్. పాలిథిన్ కవర్లో శవాన్ని ప్యాక్ చేసి సూట్ కేసులో పెట్టి ఢిల్లీకి 150 కి.మీ దూరంలో మథురకు సమీపంలో యమునా ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డుపై పడేశారు. నవంబర్ 18న యమునా ఎక్స్ ప్రెస్ వే రోడ్డుపై సూట్ కేసులో యువతి శవం లభించిందనే వార్త కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో ఒకటైన ఆయూషి చౌదరి మర్డర్ మిస్టరీని తాజాగా ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఆయూషి చౌదరి మర్డర్ కేసులో కిల్లర్స్ మరెవరో కాదు.. ఆమె తల్లిదండ్రులే. అసలేం జరిగిందంటే..
ఆయుషి చౌదరి హత్య జరిగిందిలా..
ఢిల్లీలోని బదర్‌పూర్‌లో ఆయుషి చౌదరి ఇంటిలోనే తల్లిదండ్రులే ఆమెను హత్య చేశారు. తండ్రి ఆమెను లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి రెండు బుల్లెట్లు ఛాతిలోకి దించాడు. ఆయుషి చౌదరిను హత్య చేయడంలో తల్లి అతడికి సహకరించింది. ఆ తర్వాత తండ్రి బయటికి వెళ్లి ఇంటికి దగ్గర్లోని దుకాణంలోంచి పాలిథిన్ కవర్ తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి కూతురి శవాన్ని పాలిథిన్ కవర్లో చుట్టేశారు. ఆ శవాన్ని ఓ సూట్‌కేసులో కుక్కారు. సూటుకేసును కారు డిక్కీలో తీసుకెళ్లి ఢిల్లీకి 150 కి.మీ దూరంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే పై పడేసి చేతులు దులుపుకున్నామనుకున్నారు.
మరో కులానికి చెందిన యువకుడితో ఆయుషి చౌదరి సంబంధం, ఆర్య సమాజ్‌లో పెళ్లి
ఆయుషి చౌదరి సాధారణ హత్య కాదు.. ఇదొక పరువు హత్య. ఆయుషి చౌదరి వయస్సు ప్రస్తుతం 22 ఏళ్లు. ఆయుషి చౌదరి ఢిల్లీలోనే భరత్‌పూర్‌కి చెందిన ఛత్రపాల్ అనే యువకుడిని ప్రేమించింది. అతడిది వేరే కులం అనే కారణంతో ఆయుషి చౌదరి పేరెంట్స్ వారి ప్రేమను అంగీకరించలేదు. దీంతో మేజర్స్ అయిన ఆయుషి చౌదరి, ఛత్రపాల్ ఏడాది కిందటే ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి పేరెంట్స్ అనుమతి లేకపోవడంతో ఆయుషి చౌదరి తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది.
నవంబర్ 17న ఆయుషి చౌదరి ఇదే విషయమై తన తల్లితో ఘర్షణ పడింది. ఆయుషి చౌదరి తనతో గొడవ పడిన విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పుకుంది. దీంతో ఆగ్రహంతో ఇంటికి వచ్చిన ఆయుషి చౌదరి తండ్రి.. కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆయుషి చౌదరి ఎంతకీ తండ్రి మాట వినకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న ఆయుషి చౌదరి తండ్రి అదే ఆగ్రహంలో లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసి ఆమె ఛాతిపై రెండు రౌండ్లు కాల్చాడు. తండ్రి జరిపిన కాల్పుల్లో ఆయుషి చౌదరి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.
మధ్యాహ్నం డెడ్ బాడీ ప్యాకప్.. శవంతో మిడ్నైట్ ఢిల్లీ టు మధుర జర్నీ
ఉదయం ఈ ఘటన జరగ్గా మధ్యాహ్నం డెడ్ బాడీని సూటుకేసులో ప్యాక్ చేసి పెట్టాడు. ఆర్థరాత్రి 3 దాటాకా కారులో శవాన్ని తీసుకెళ్లి తెల్లవారు జామున 5 గంటలకు ఎవ్వరూ చూడని సమయం చూసి యమునా ఎక్స్‌ప్రెస్ వే పడేసి వచ్చారు. ఆ సమయంలో తండ్రి కారు నడుపుతుండగా.. తల్లి ముందు సీటులో కూర్చుని ఉంది. మళ్లీ తెల్లవారుజామున 7 గంటలకు ఇద్దరూ కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
మిస్సింగ్ కేసు కూడా పెట్టని ఆయుషి పేరెంట్.. అయినా ఇంటికే డైరెక్ట్ కాల్ చేసిన పోలీసులు..
ఢిల్లీలోని ఇంట్లో ఆయుషి చౌదరిని హత్య చేసి, శవాన్ని ఉత్తర్ ప్రదేశ్ లో 150 కిమీ దూరంలో పడేసి ఏమీ ఎరుగనట్టే ఉన్న ఆయుషి చౌదరి పేరెంట్స్.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చాలామంది తరహాలో తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీంతో ఆయుషి చౌదరి గురించి మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ నవంబర్ 18న ఆయుషి చౌదరి డెడ్ బాడీని కనుగొన్న పోలీసులు.. కేసు దర్యాప్తులో భాగంగా డైరెక్టుగా ఆయుషి చౌదరి తల్లిదండ్రులకే ఫోన్ చేశారు.
హత్యకు గురైంది ఆయుషి చౌదరినే అని ఎలా తెలిసిందబ్బా..
ఎవ్వరికీ చెప్పకుండానే తమ దొంగతనం ఎలా బయటపడిందని ఆయుషి పేరెంట్స్ ఖంగుతిన్నారు. ఆయుషి తల్లి, సోదరుడు ఇద్దరూ కలిసి మధుర పోలీసులు పిలిచినట్టే మధురలోని హాస్పిటల్ మార్చురికి వెళ్లారు. ఆయుషి చౌదరిని గుర్తించే క్రమంలో బోరున విలపించారు. ఆయుషి చౌదరిని గుర్తించిన అనంతరం పోలీసులతో కలిసి నేరుగా కారు వద్దకే వెళ్లిపోయారు. అయితే, ఆయుషి చౌదరి శవం లభ్యమైన సందర్భంలో ఢిల్లీ పోలీసుల నుంచే ఇన్ ఫార్మర్ ద్వారా మధుర పోలీసులకు ఫోన్ కాల్ వెళ్లిందని చెబుతున్నప్పటికీ.. మరో సమాచారం ఏంటంటే.. ఆయుషి హత్య గురించి ఆయుషికే బాగా తెలిసిన వారు నేరుగా మధుర పోలీసులకు సమాచారం అందించారని.
అలా మొత్తానికి ఆయుషి చౌదరి శవం గుర్తుతెలియని యువతి హత్య కేసు మిస్టరీగా ఉండిపోతుందని.. తమ బండారం బయటపడదని భావించిన ఆయుషి పేరెంట్స్ ఆటకట్టించినట్టయింది. ఢిల్లీలోని బదర్‌పూర్ నుంచి మధురకు వెళ్లే దారిలో ఉన్న టోల్ గేట్స్ వద్ద ఆయుషి తండ్రి ఉపయోగించిన కారు మధురకు వెళ్లడం, రావడం వంటి దృశ్యాలు కూడా మధుర పోలీసుల విచారణకు ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. ఆయుషి చౌదరి తల్లిదండ్రులిద్దరిని పట్టించేందుకు అవి కూడా సాక్ష్యాధారాలుగా పోలీసులు ఉపయోగించుకుని ఉండవచ్చు. మొత్తానికి అలా ఆయుషి చౌదరి మర్డర్ మిస్టరీ వీడింది.