ఇండియాలో అమెరికన్ కష్టాలు ; ABCD ట్రయిలర్ అదుర్స్
అల్లూ శిరీష్ నటించిన ABCD మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు
మలయాళంలో సూపర్ హిట్ సొంతం చేసుకున్న ABCD మూవీకి అదే పేరుతో తెలుగు తెరపైకి వస్తున్న రీమేక్ ఇది. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ మూవీ రిలీజ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమ్మర్ ఎట్రాక్షన్ గా మే 17న థియేటర్లలోకి రానుంది ABCD.ఈ క్రమంలో అభిమానుల్లో హైప్ క్రియేట్ ప్లాన్ లో భాగంగా ఈ మూవీకి సంబంధించిన ట్రయిలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
కథాంశం ఇదే..
ఇండియాలో అమెరికన్ కష్టాలు ఎలాగుంటాయో తెలియజేస్తూ తీసిన చిత్రమే ABCD. ఈ మూవీలో అమెరికాలో పుట్టి విలాసవంతమైన జీవితం గడిపే హీరో ఇండియాకొచ్చి మురికివాడల్లో ఎలాంటి కష్టాలు పడ్డాడనే విషయాన్ని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు .
యాక్టింగ్ అదుర్స్
అల్లు శిరీష్ కు చెందిన ఈ రెండు షేడ్స్ ను ట్రయిలర్ లో చూపించారు. శిరీష్ సరసన హీరోయిన్ గా నటించిన రుక్సార్ థిల్లాన్ ట్రయిలర్ లో ఆకట్టుకుంది. అల్లు శిరీష్ ఫ్రెండ్ గా భరత్ కొత్తగా కనిపించాడు. మొన్నటివరకు బాలనటుడి పాత్రలు వేసిన భరత్, ఇప్పుడు గడ్డంతో కనిపించాడు.