ఇండియాలో ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ కరువవడంపై భారత కెప్టెన్ సునీల్ ఛేత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 'ఆటతీరులో ఇతర దేశాల స్థాయిని అందుకోకపోవచ్చు. కానీ నెట్‌లో దూషించకుండా మైదానాలకు రండి.. మా ఆట చూడండి.. బాగోలేక పోతే మా ముఖాలమీదే తిట్టండి. మీ మద్దతు ఎంత అవసరమో మీరు తెలుసుకోలేకపోతున్నారు' అని అన్నాడు. శుక్రవారం చైనీస్ తైపీపై భారత్ విజయం సాధించగా.. ఈ మ్యాచ్‌కు కేవలం 2వేల మంది మాత్రమే హాజరయ్యారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


గ్రౌండ్‌కి వెళ్లి మద్దతు ఇవ్వండి: కొహ్లీ విజ్ఞప్తి


భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రి చేసిన వినతిని అందరూ మన్నించాలని  టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ  పేర్కొన్నాడు.'నాకు మంచి స్నేహితుడు, ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రి వినతిని అందరూ మన్నించాలి' అని వీడియోను పోస్టు చేస్తూ కొహ్లీ అన్నారు. అంతేకాదు.. స్టేడియాలకు వెళ్లి క్రీడాకారులకు మద్దతు తెలపాలని భారత ప్రజలను కోరారు. ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళను సపోర్టు చేయాలని అభిమానులను విజ్ఞప్తి చేశాడు. క్రీడా స్ఫూర్తిదాయక దేశంగా భారత్ ఎదగాలంటే అన్ని ఆటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు.