Agnipath Scheme Age Limit Extended: అగ్నిపథ్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్
Agnipath Scheme Age Limit Extended: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
Agnipath Scheme Age Limit Extended: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఆశావహులైన అభ్యర్థులకు తోడుగా ప్రతిపక్షాలు కూడా రోడ్డెక్కి తమ గళం వినిపించాయి. ఇక ఇదిలావుంటే, ఈ నిరసనల మధ్యే తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.
అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితిని 17½ ఏళ్ల నుంచి 21 ఏళ్లుగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే, గత రెండేళ్లుగా కరోనావైరస్ ప్యాండెమిక్ కారణంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నియామకాలు లేకపోవడంతో కేంద్ర బలగాల్లో చేరేందుకు ఎదురుచూస్తూ వయో పరిమితిని కోల్పోయిన వారి సంగతి కూడా తెలిసిందే. ఇలా వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోయిన వారిని దృష్టిలో పెట్టుకుని, 2022 ఏడాదికిగాను మరో రెండేళ్ల వయస్సు మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అగ్నిపథ్ పథకం కింద కేంద్ర బలగాల్లో చేరాలనుకునే వారికి వయో పరిమితిని 23 ఏళ్ల వరకు పెంచినట్టయింది. కేవలం ఈ ఒక్క ఏడాది జరిగే అగ్నిపథ్ స్కీమ్ రిక్రూట్‌మెంట్‌కి మాత్రమే ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. అంటే ఈ ఏడాది 17 ½ నుంచి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు అగ్నిపథ్ స్కీమ్ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట. అగ్నిపథ్ స్కీమ్ కింద కేంద్ర బలగాల్లోకి రిక్రూట్ అయ్యే సైనికులను అగ్నీవీర్ అని పిలవనున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే, దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులను కూడా కాంట్రాక్ట్ పేరిట కేవలం నాలుగేళ్ల సర్వీసులోకి తీసుకోవడం అంటే.. అది వారి మనోధైర్యంతో ఆడుకోవడమే అవుతుందని.. ఇది దేశ రక్షణకు పెనుముప్పు వాటిల్లేలా చేస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన (Protests Against Agnipath Scheme) వ్యక్తంచేస్తున్నాయి.
Also read : Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై నెలలో త్రిపుల్ బంపర్ ఆఫర్
Also read : Minister KTR Tweet: ప్రధాని మోదీ, అదానీ గ్రూప్ మధ్య ఏముంది..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook