హైదరాబాద్: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత వైమానిక దళం జరిపిన ఉగ్రవాద దాడులపై సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖుల నుంచి రాజకీయ పార్టీల వరకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి వచ్చిన భారత వైమానిక దళంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ... వాయి సేన జరిపిన దాడిని ఆయన కొనియాడారు. స్వీయ రక్షణ కోసం దాడులు చేసే హక్కు భారత్‌కు ఉందని చెబుతూ భారత దేశం గొప్పతనాన్ని చాటిన వాయు సేనపై ప్రశంసలు గుప్పించారు. ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ 51లోనే ఈ విషయం ఉందని అసదుద్దీన్ అన్నారు. 


భారత్ ఇవాళ చేసిన ఈ దాడిని ఎప్పుడో చేసి వుండాల్సింది అని అసద్ స్పష్టంచేశారు. అంతర్గత విబేధాలు ఎలా వున్నా దేశ భద్రత విషయంలో తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని అసదుద్దిన్ ఒవైసి స్పష్టం చేశారు.