పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక విమాన ఏర్పాట్లు చేసింది. దేశ రాజధాని నుంచి ముంబై, కోల్ కతా నగరాలకు డబుల్ డెక్కర్ విమానాలను నడపనున్నట్లు ఈ మేరకు ఎయిర్ ఇండియా ప్రకటించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండగ సీజన్ ను పురస్కరించుకొని ఈ నెల 16  నుంచి 21 వరకు ఢిల్లీ నుంచి కోల్ కతా, ముంబై  ప్రాంతాలకు రోజుకు ఓ విమానాన్ని నడుపనున్నారు. అవసరాన్ని బట్టి రోజుకు రెండు జంబో విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే హైదరాబాద్, చైన్నై, బెంగళూరు లాంటి నగరాలకూ ఈ జంబో విమానాలు నడిపే అవకాశముందని ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఓ అధికారి తెలిపారు.


జంబో విమానంలో మొత్తం 423 సీట్లు ఉండగా అందులో 12 ఫస్ట్‌ క్లాస్‌, 26 బిజినెస్‌, 385 ఎకానమీ సీట్లు ఉన్నాయి. నాలుగు ఇంజిన్లతో ఉండే ఈ విమానాలను సాధారణంగా వీవీఐపీల అంతర్జాతీయ పర్యటనలకు ఉపయోగిస్తుంటారు.  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సాధారణ ప్రయణికులకూ అందుబాటులోకి తెస్తూ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.