న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ ఇప్పటివరకు 20కి పైగా దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 100 కి పైగా అంటువ్యాధులు నమోదయ్యాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి స్పందిస్తూ.. వివిధ దేశాల నుండి భారత్ కు వచ్చే ప్రయాణికులను పరీక్షించే ప్రక్రియను సమీక్షించడానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనా, హాంకాంగ్ దేశాలనుండే కాకుండా, సింగపూర్, థాయిలాండ్ నుండి విమానాలలో వచ్చే ప్రయాణీకులను సైతం పరీక్షించాలని అన్నారు.


వుహాన్ నగరంలో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు అధిక జ్వరం కారణంగా భారతదేశానికి వస్తున్న మొదటి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కకుండా ఆగిపోయారని అధికారులు తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు చేయవలసి ఉంటుందని తెలిపారు. .


మరోవైపు చైనా లోని వుహాన్ నగరం నుంచి 324 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు కాగా, 110 మంది పనిచేస్తున్న వివిధ రకాల ఉద్యోగులు. ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో వీరు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మరో విమానం చైనాకు బయలు దేరింది. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన ఐదుగురు డాక్టర్లు మొదటి విమానంలో పర్యవేక్షించారు. 



చైనా నుంచి వచ్చే 300 మంది విద్యార్థుల కోసం ఢిల్లీకి సమీపాన మానేసర్‌లో ప్రత్యేక వైద్య కేంద్రాన్ని భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇదే విధంగా సరిహద్దు రక్షక బృందం ఐటిబిపి వాయువ్య ఢిల్లీ లోని చావ్లా ఏరియాలో ప్రత్యేక వైద్య కేంద్రంలో 600 పడకలను ఏర్పాటు చేసింది. రెండు వారాల పరిశీలనలో వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యబృందం తక్షణం తగిన చర్యలు తీసుకుంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..