ajay devgn next film: న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగన్ ( Ajay Devgn ) తదుపరి చిత్రంపై కీలక ప్రకటన వెలువడింది. అది విన్నతర్వాత భారతీయులంతా గర్వపడుతున్నారు. ఇటీవలనే ‘‘తనాజీ: ది అన్సంగ్ వారియర్’’ ( Tanhaji ) చిత్రంతో ప్రాచీన భారత యోధుల శౌర్యాన్ని చూపించిన అజయ్ దేవ్‌గన్.. ఇప్పుడు భారత సైన్యంలోని వీరుల కథను వెండితెరపైకి తెచ్చేందుకు సన్నాహాల్లో ఉన్నారు. లడఖ్‌లోని గాల్వన్ లోయ ( Galwan Valley ) లో ఇండో-చైనా మధ్య జరిగిన ఉద్రిక్తతలపై అజయ్ దేవ్‌గన్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. Also read: PM Modi meets soldiers: జవాన్ల ధైర్య సాహసాలను మెచ్చుకున్న ప్రధాని మోదీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమాచారమిచ్చిన ట్రేడ్ అనలిస్ట్.. తరణ్ ఆదర్శ్..
ఈ మేరకు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ తన ట్విట్టర్ వేదిక ద్వారా ఈ సమాచారమిచ్చారు. గాల్వన్ లోయలో జరిగిన ఘటనపై అజయ్ దేవ్‌గన్ సినిమా చేయబోతున్నట్లు తరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ను ప్రకటించలేదు. ఈ చిత్రంలో చైనా సైన్యంతో పోరాడి అమరులైన 20 మంది భారత ఆర్మీ సైనికుల కథను చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గన్ ఎఫ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ సంయూక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్ర తారాగణాన్ని ఇంకా ఖరారు చేయాల్సిఉంది. అయితే.. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ నటిస్తారా లేదా అనేది స్పష్టత రాలేదు. ఈ వార్త వెలువడినప్పటి నుంచి అజయ్ దేవగన్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. Also read: 
China Dispute: భారత్ తోనే కాదు..18 దేశాలతో చైనాకు వివాదం


జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా, భారత సైనికుల (India-china dispute) మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో చైనా దురాఘతానికి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అమరులైన వారిలో సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..