Bank Holidays: జనవరిలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడు ఎక్కడ

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన గమనిక, జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో చెక్ చేద్దాం..
Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. అదే విధంగా జనవరి 2025 సెలవుల లిస్ట్ విడుదలైంది. కొత్త ఏడాది మొదటి నెలలో ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. అయితే ఇందులో జాతీయ సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులున్నందున రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి.
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి. అంతా డిజిటలైజేషన్ అయినా సరే కొన్ని ప్రత్యేక పనులుంటే మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంకు పనులుంటే బ్యాంకు సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఆర్బీఐ ప్రతి నెలా జారీ చేసినట్టే వచ్చే ఏడాది 2025 జనవరి నెల హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. జనవరిలో బ్యాంకులకు 15 రోజులు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు, రిపబ్లిక్ డే, సంక్రాంతి సెలవులున్నాయి. బ్యాంకులకు సెలవులున్నా ఆన్‌లైన్ సేవలు, ఏటీఎం సేవలు మాత్రం కొనసాగనున్నాయి.
జనవరి 2025 బ్యాంకు సెలవుల జాబితా
జనవరి 1 న్యూ ఇయర్ దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జనవరి 2 మన్నమ్ జయంత్రి కేరళలో సెలవు
జనవరి 5 ఆదివారం సెలవు
జనవరి 6 గురు గోవింద్ సింగ్ జయంతి, హర్యానా, పంజాబ్‌లో సెలవు
జనవరి 11 రెండవ శనివారం సెలవు
జనవరి 12 ఆదివారం సెలవు
జనవరి 14 మకర సంక్రాంతి , ఏపీ, తెలంగాణ, తమిళనాడులో బ్యాంకులకు సెలవు
జనవరి 15 మకర సంక్రాంతి, తిరువల్లూరు డే, తమిళనాడు, అసోంలో సెలవు
జనవరి 16 ఉజ్జవర్ తిరునాళ్, తమిళనాడులో సెలవు
జనవరి 19 ఆదివారం సెలవు
జనవరి 22 ఇమోయిన్, మణిపూర్‌లో సెలవు
జనవరి 23 నేతాజి జయంతి, మణిపూర్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్, ఢిల్లీలో బ్యాంకులకు సెలవు
జనవరి 25 నాలుగో శనివారం సెలవు
జనవరి 26 రిపబ్లిక్ డే, ఆదివారం సెలవు
జనవరి 30 సోనమ్ లోసర్ సిక్కింలో సెలవు
Also read: AP Government: సంపద కోసం బాండ్లు అమ్మేస్తున్న ఏపీ ప్రభుత్వం, మరో 5 వేల కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.