ఆల్కాహాలిక్స్ అనానిమస్ గ్రూప్  అనే సంస్థ ఇటీవలే చేసిన సర్వే ప్రకారం దేశ రాజధానిలో మద్యానికి బానిసలవుతున్న వారిలో పురుషులతో పోల్చుకుంటే మహిళల శాతమే ఎక్కువగా ఉందని తేల్చింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు చండీగఢ్, గోవా, హైదారాబాద్, సిమ్లా మొదలైన ప్రాంతాల్లో మద్యానికి అలవాటు పడుతున్న మహిళల శాతం రోజు రోజుకూ పెరుగుతుందని ఈ సర్వే తెలియజేసింది.


ముఖ్యంగా ఢిల్లీలో ఒకప్పటితో పోల్చుకుంటే నేడు పబ్ కల్చర్ బాగా పెరగడంతో మద్యానికి అలవాటు పడిపోతున్న మహిళల శాతం కూడా పెరిగిందని సర్వే పేర్కొంది. నేడు అనేక బహుళ జాతీయ సంస్థలు వీకెండ్ పార్టీల పేరుతో ఉద్యోగులకు ఇస్తున్న పార్టీల్లో మద్యాన్ని కూడా సర్వ్ చేయడంతో.. మహిళలు కూడా వాటిని తాగడం అలవాటు చేసుకుంటున్నారని ఈ సర్వే తెలియజేయడం గమనార్హం.