కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసు(Kanpur Encounter Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే (history sheeter Vikas Dubey) అత్యంత సన్నిహితుడు, అనుచరుడు అమర్ దుబే పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్, హమీర్‌పూర్‌లోని మౌదహలో బుధవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force) పోలీసులు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. యూపీలో దుండగుల కాల్పులు.. డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలోని కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ముందే సమాచారం అందుకున్న వికాస్ దుబే (Vikas Dubey) గ్యాంగ్ ప్లాన్ ప్రకారం కాల్పులు జరిపడంతో డీఎస్సీ సహా 8 మంది పోలీసులు చనిపోవడం తెలిసిందే. ఈ కేసులో అమర్ దుబే నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అంతకుముందు కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే ఢిల్లీ-మథుర హైవేలోని ఓ హోటల్‌లో దాక్కున్నట్లు సమాచారం అందుకున్నారు.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


ఫరీదాబాద్‌లోని బధ్కాల్ చౌక్ ఏరియాలో టాస్క్‌ఫోర్స్ టీమ్, మరికొందరు పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. వికాస్ దుబే ఓ అనుచరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జులై 3న గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై విచాక్షణారహితంగా కాల్పులు జరిపి 8 మంది టీమ్‌ను పొట్టనపెట్టుకున్నారు.


20 టీమ్స్ పోలీసులు వికాస్ దుబే కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గ్యాంగ్‌స్టర్‌పై రివార్డును రూ.2.5 లక్షలకు సైతం పెంచారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos