Punjab Crisis: పంజాబ్‌ కాంగ్రెస్‌(Punjab Crisis) పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. అమరీందర్ సింగ్ రాజీనామాతో మెుదలైన ఈ సంక్షోభం..సిద్ధూ రాజీనామా వరకు కొనసాగింది. పంజాబ్(Punjab) రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో అమరీందర్‌ సింగ్‌ బుధవారం అమిత్‌ షా(Amit Shah)తో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో స్పందించిన కెప్టెన్‌ అమరీందర్‌(Amarinder singh).. తాను భాజపాలో చేరడం లేదని వెల్లడించారు. అలాగని కాంగ్రెస్‌(Congress)లోనూ కొనసాగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంకా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘52ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఓ రోజు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు నాకు ఫోన్‌ చేసి రాజీనామా చేయమని చెప్పారు. అయినప్పటికీ తిరిగి నేను ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. ఆరోజు సాయంత్రమే గవర్నర్‌ వద్దకు వెళ్లి రాజీనామా చేశాను. యాభై ఏళ్ల తర్వాత నాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తనకు కాంగ్రెస్‌ పార్టీ కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించింది. ఇప్పటివరకు నేను పార్టీకి రాజీనామా చేయనప్పటికీ నమ్మకం లేని చోట నేను కొనసాగలేను'’ అని ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌(Amarinder singh) స్పష్టం చేశారు. అయితే, భాజపా(Bjp)లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. భాజపాలో చేరడం లేదని వివరణ ఇచ్చారు.


Also Read: Bhabanipur bypoll: పశ్చిమ బెంగాల్‌లో 3 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్‌


'సిద్ధూ స్థిరత్వం లేని వ్యక్తి'..
అంతేకాకుండా పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ(Sidhu) రాజీనామా చేయడాన్ని ప్రస్తావించిన అమరీందర్‌.. ఓ స్థిరమైన మనస్తత్వం లేని వ్యక్తి చేతిలో పార్టీ పగ్గాలు పెడితే ఇలాగే వ్యవహరిస్తారని అన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌తో  సరిహద్దు కలిగిన పంజాబ్‌ చాలా సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రమని.. అటువంటప్పుడు సిద్ధూ వంటి నేతలతో దేశ భద్రతకు ముప్పేనని వ్యాఖ్యానించారు. ఇలా తాను కాంగ్రెస్‌లో కొనసాగనని ప్రకటించిన కొద్దిసేపటికే.. అమరీందర్‌ సింగ్‌ ట్విటర్‌(Twitter) అకౌంట్‌ కూడా అప్‌డేట్‌ అయ్యింది. అంతకుముందు ట్విటర్‌ బయోలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా పేర్కొనగా.. తాజాగా దాన్ని తొలగించడం గమనార్హం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook