Amarnath Bus Breaks Fail: అమర్‌నాథ్ యాత్ర పూర్తి చేసుకుని పంజాబ్‌కు తిరగు ప్రయాణమైన ఓ బస్సుకు ఒక్కసారిగా బ్రేకులు విఫలమయ్యాయి. ఘాటీ రోడ్ కావడంతో ప్రయాణీకులు భయపడిపోయారు. రన్నింగ్ బస్సులోంచి దూకేయడంతో గాయాలపాలయ్యారు. జమ్ము కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌లోని హోషియార్ పూర్‌కు చెందిన యాత్రికులు అమర్‌నాథ్ యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మొత్తం 40 మంది యాత్రికులతో ఉన్న బస్సు జమ్ము కశ్మీర్‌లోని రాంబన్ జిల్లా బనిహాల్ సమీపంలోని నచ్లానా వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదంతా ఘాటీ రోడ్డు కావడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పానిక్ అయిన ప్రయాణీకులు అలాగే రన్నింగ్ బస్సులోంచే దూకడం ప్రారంభించారు. ఓ చిన్నారి సహా 10 మంది దూకేశారు. దాంతో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కదులుతున్న బస్సులోంచి ప్రయాణీకులు దూకడాన్ని గమనించిన అక్కడున్న ఆర్మీ, పోలీసు దళాలు అప్రమత్తమయ్యారు. ఆర్మీ వెంటనే స్పందించింది. బస్సు వేగాన్ని నియంత్రించేందుకు బస్సు టైర్ల కింద రాళ్లు అడ్డంగా వేయడం ప్రారంభించారు. మొత్తానికి ఎట్టకేలకు బస్సును ఆపగలిగారు. ఆలస్యం జరిగినా, బస్సు ఆపలేకపోయినా నేరుగా ఘాటీ నుంచి నదీ ప్రవాహంలో పడిపోయేదని , పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.



గాయపడినవారికి సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


Also read: Ban on Panipuri: త్వరలో పానీ పూరీపై నిషేధం, ఏయే రాష్ట్రాల్లోనంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook