Level 4 Bullet Proof Jackets For India: ఉగ్రవాదుల చెంతకు అమెరికా బుల్లెట్లు, తట్టుకోలేకపోతున్న భారత భద్రతాసిబ్బంది
American Bullets At Terrorists: కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదులు అత్యాధునిక బుల్లెట్లను వాడుతున్నారు. అవి ఎంతలా అంటే లెవల్ త్రీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను సైతం చిల్చుకునిపోయేంతలా. అమెరికా సైన్యం ఉపయోగించే ఈ బులెట్లు ఉగ్రవాదుల దగ్గరకు ఎలా వచ్చాయి.
American Bullets At Terrorists: పొరుగున ఉండే పాకిస్తాన్ తో నిత్యం భారత్ కు టెన్షనే. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఎప్పుడు తుపాకుల మోత మోగుతుందో చెప్పలేం. అక్కడ విధులు నిర్వహించే భారత భద్రతా సిబ్బంది రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా ఫైరింగ్ జరిగినప్పుడు సైనికులకు ఎలాంటి బుల్లెట్ గాయాలు కాకుండా ప్రత్యేక లెవల్ త్రీ(level-3) జాకెట్లను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ ఈ మధ్య భద్రతా బలగాలకు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో లెవల్ త్రీ జాకెట్లు కూడా ఉగ్రవాదుల బుల్లెట్లను తట్టుకోలేకపోయాయి. ఆ బులెట్లను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆప్ఘనిస్తాన్ లో అమెరికా బలగాలు వదిలేసిన ఆయుధసామాగ్రిని ఉగ్రవాదులు భారత్ ను నాశనం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ బుల్లెట్లు లెవల్ త్రీ జాకెట్లలోనికి కూడా చొచ్చుకొనివెళ్తాయని గుర్తించారు.
ఆప్ఘనిస్తాన్ లోకి తాలిబన్లు ఎంటర్ కావడంతో అప్పటివరకు అక్కడ ఉన్న అమెరికా బలగాలు తిరిగి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. అనుకున్న సమయం కంటే ముందు యూఎస్ ట్రూప్స్ తిరిగివెళ్లడంతో వారి ఆయుధసామాగ్రిని ఆప్ఘన్ లోనే వదిలివెళ్లారు. ఈ బులెట్లు అక్కడివేనని తేలింది. అంతేకాదు అత్యాధునికమైన కెనడాకు చెందిన నైట్ విజన్ స్కోపులు సైతం ఉగ్రవాదులకు అందాయి. ఇవి నాటో బలగాల స్టాక్ గా గుర్తించారు.
ఉగ్రవాదుల వద్ద ఉన్న బుల్లెట్లను స్టీల్ కోర్ బుల్లెట్లుగా పిలుస్తారు. ఈ బుల్లెట్లనుంచి రక్షణ పొందేకు భారత భద్రతా బలగాలు కూడా చర్యలు మొదలుపెట్టాయి. త్వరలోనే లెవల్ ఫోర్(level-4) బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందుబాటులోకి వస్తాయని శ్రీనగర్ బేస్డ్ చినార్ కార్ప్స్ అధికారులు తెలిపారు. అమెరికా బలగాలు ఆప్ఘన్ లో దాదాపుగా 8 బిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధ సామాగ్రిని వదిలివెళ్లాయి. అందులో హెలికాప్టర్లు, కంబాట్ వెహికల్స్, ప్రసార సాధనాలు కూడా ఉన్నాయి
ఇందులో ఎక్కువభాగం తాలిబన్ల వద్దే ఉన్నప్పటికీ.. కొంత ఆయుధ సామాగ్రి ఐసిస్ టెర్రరిస్టుల చేతికి కూడా అందినట్టు తెలుస్తోంది. గతంలో కూడా జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల వద్ద అమెరికాకు చెందిన ఎం-16(M-16) అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు ఎం4ఏ (M-4A) కార్బైన్స్ కూడా దొరికాయి.
Also Read: Tarsame Singh Saini Aka Taz: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ కన్నుమూత!
Also Read: Hyderabad: నగరవాసులకు విజ్ఞప్తి... మీ ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook