American woman raped in Rishikesh: రిషికేశ్‌: అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ (American woman) పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆధ్యాత్మిక పట్టణమైన రిషికేశ్‌లో చోటుచేసుకుంది. అగ్రరాజ్యానికి చెందిన ఓ మహిళ యోగా గురించి మరింత తెలుసుకునేందుకు అమెరికా నుంచి ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని పవిత్ర పట్టణమైన రిషికేశ్‌ (Rishikesh)‌ కు వచ్చి నివసిస్తోంది. ఈ క్రమంలో అమెరికా మహిళకు అభినవ్ రాయ్‌ అనే స్థానిక వ్యక్తితో పరిచయం ఎర్పడింది. అయితే తనతో స్నేహం చేసిన వ్యక్తే.. అక్టోబర్‌ 5వ తేదీన బాల్కానీ లోనుంచి తాను ఉండే ఇంట్లోకి చొరబడి.. తనపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడని (American woman raped) మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందు నిందితుడు తనతో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది.  Also read: Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. అమెరికా మహిళకు యోగా, డ్రగ్స్‌పై ఉన్న ఇష్ట‌మే ఆమెను నిందితుడికి ద‌గ్గ‌ర చేశాయ‌ని రిషికేశ్ పోలీసు అధికారి ఆర్కే సక్లానీ పోర్కొన్నారు. ఈ సంఘటనకు ముందే నిందితుడు ఆమెను వేధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో తన కొడుకుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని నిందితుడి తండ్రి అమెరికన్ మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు సక్లానీ తెలిపారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.    Also read: Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe