భోపాల్ : మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అమిత్ షా పర్యటనలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. అశోక్‌నగర్‌లో పర్యటించిన అమిత్ షా రోడ్ షో ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో వాహనం ఎక్కుతుండగా అకస్మాత్తుగా పట్టుకోల్పోయి కింద పడబోయారు. అయితే, వెంటనే అప్రమత్తమైన బాడీగార్డు.. అమిత్ షాను ఒడిసి పట్టుకుని, చేయి అందించి పైకి లేపారు. దీంతో బీజేపీ కార్యకర్తలంతా తమ నేత సురక్షితంగానే ఉన్నారని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం శివపురి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలతో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


శివపురి జిల్లా ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకొస్తుందని పగటి కలలు కంటున్నారు కానీ అది సాధ్యమయ్యే పనికాదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉండగా... 2005 తర్వాతి నుంచి శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు.