దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019 నిరసన ప్రదర్శనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలకు .. విధ్వంసానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీకి మూల్యం చెల్లించుకునే రోజులు ఆసన్నమయ్యాయన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ కార్యకర్తల గ్యాంగ్‌లు ఢిల్లీలో అశాంతిని రగిలించాయని విమర్శించారు. దేశ రాజధానిలో జరుగుతున్న హింసకు వారే కారణమని నిందించారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు.