Anand Mahindra hilarious reply to Patrick Collison over Twitter CEO Parag Agrawal's appointment: ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారత సంతతికి చెందిన టెక్కీ పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agrawal) ఆ స్థానంలో ఏక‌గ్రీ‌వంగా నియమితులయిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా పరాగ్‌ ట్విటర్‌కు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా ఉన్నారు. 2006లో ముగ్గు‌రితో కలిసి డోర్సే ట్విట‌ర్‌ను స్థాపిం‌చారు. అప్పటి నుంచి ఆయన ట్విట్టర్‌ సీఈఓ (Twitter CEO)గా కొన‌సా‌గారు. దాదాపు 15 ఏళ్ల అనం‌తరం సంస్థకు కొత్త సీఈవో రాగా.. అది‌ మన భార‌తీ‌యు‌డికి అవ‌కాశం లభిం‌చడం గమ‌నార్హం. దాంతో పరాగ్‌ అగర్వాల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవిదేశీ ప్రముఖులు అందరూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐరీష్‌ బిలియనీర్‌, స్ట్రైప్‌ కో ఫౌండర్‌ ప్యాట్రిక్‌ కొలిసన్‌ ట్విటర్‌ కొత్త సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agrawal)కు అభినందనలు తెలిపారు.  'గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలోఆల్టో నెట్‌వర్క్స్‌.. ఇప్పుడు ట్విటర్! ఈ సంస్థలు భారత్‌ నుంచి వచ్చిన సీఈఓల ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. భారత్‌ నుంచి వ్యక్తులు టెక్ ప్రపంచంలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. భారతీయుల విజయాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. అలాగే వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకు ఇది పెద్ద నిదర్శనం' అని కొలిసన్ గత రాత్రి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయింది. 


Also Read: IPL 2022 Retention: ఎంఎస్ ధోనీకి షాక్.. సీఎస్‌కే రిటైన్ చేసుకునేది ఆ నలుగురినే!!


ప్యాట్రిక్‌ కొలిసన్‌ (Patrick Collison) చేసిన ట్వీట్ చూసిన భారత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తనదైన శైలిలో స్పందించారు. 'ఈ మహమ్మారి భారత్‌లో ఉద్భవించిందని చెప్పడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది ఇండియన్ సీఈఓ వైరస్. దీనికి టీకా అస్సలు లేదు' అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మరిన్ని టాప్ కంపెనీలకు భారతీయులు సీఈఓలుగా వస్తారని మహీంద్రా చెప్పకనే చెప్పారు. గ్లోబల్‌ టెక్నా‌లజీ దిగ్గ‌జాలు వరు‌సగా భార‌తీ‌యుల సార‌థ్యం‌లోకి వస్తు‌న్న విషయం తెలిసిందే. మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు అతడికి మద్దుతుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. 


Also Read: Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్!


ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ కొత్త సీఈఓ (Twitter New CEO ) అయిన పరాగ్‌ అగర్వాల్‌ (Parag Agrawal).. ఐఐటీ బాంబే, స్టాన్‌‌ఫోర్డ్‌ విశ్వ‌వి‌ద్యా‌లయం పూర్వ విద్యార్థి. పదేళ్ల క్రితం ట్విట్ట‌ర్‌లో యాడ్స్‌ ఇంజి‌నీ‌ర్‌గా చేరారు. ఎంతో కస్టపడి పైకివచ్చారు. అంచె‌లం‌చె‌లుగా ఎదు‌గుతూ 2017లో ట్విటర్‌ టెక్నా‌లజీ అధి‌ప‌తిగా పదో‌న్నతి పొందారు. ఇప్పుడు ఏకంగా సీఈ‌వోగా ఎన్ని‌క‌య్యారు. పరాగ్‌ అగర్వాల్‌ గతంలో మైక్రో‌సాఫ్ట్‌, యాహూ వంటి పెద్ద సంస్థ‌ల్లోనూ పని‌చే‌శారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook