అనంత్‌నాగ్: ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
అనంత్‌నాగ్: ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్ జిల్లా దియాల్గమ్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ తీవ్రవాది మరణించాడు.
ఎన్‌కౌంటర్ ఆదివారం తెల్లవారుఝామున ప్రారంభమైంది. కాల్పుల్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.
ఇక జమ్మూకాశ్మీర్ పరిధిలోగల షోపియాన్ జిల్లా కచ్దూర ప్రాంతంలోనూ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనిక వాహనంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఘటనా స్థలిలో తనిఖీలు చేస్తున్నారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.