Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దాంతో ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చు. దాంతో ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలోని అదిలాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, జగిత్యాల, నిర్మల్, కొమురం భీం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతారవణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చు. 


ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాలుగు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపుకు చేరనుంది. ఫలితంగా ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇవాళ ఉండవచ్చు. దక్షిణ కోస్తాలో రేపటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా వీస్తాయి. 


మొత్తానికి బంగాళాఖాతంలో మార్పుల కారణంగా ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ-అతి భారీ వర్షాలు కూడా పడవచ్చు. రానున్న 4 రోజులు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ వెల్లడించింది. 


Also read: 7th Pay Commission Latest News: గుడ్‌న్యూస్, సెప్టెంబర్‌లో 3 శాతం డీఏ పెంపు, భారీగా పెరగనున్న జీతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook