AP Voters list 2024: ఓటర్ల జాబితాలో మీ పేరుందా లేదా, ఇలా చెక్ చేసుకోండి
AP Voters list 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండూ కలిపి జరగనున్నాయి. మరి మీ ఓటు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్ చేసుకోవచ్చనే వివరాలు తెలుసుకుందాం.
AP Voters list 2024: దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. మరి మీ ఓటు హక్కు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా https://electoralsearch.eci.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పేరు సెర్చ్ చేసేందుకు మీడు మూడు ఆప్షన్లు కన్పిస్తాయి. EPIC ID లేదా మొబైల్ నెంబర్ లేదా ఇతర వివరాలను సమర్పించడం ద్వారా సెర్చ్ చేయవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఇతర వివరాలంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, జెండర్, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు ఫిల్ చేయాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు..జాబితాలో మీ పేరుంటే అక్కడ పోలింగ్ బూత్, అడ్రస్, సీరియల్ నెంబర్ తో సహా వివరాలు కన్పిస్తాయి.
EPIC IDతో చెక్ చేయాలంటే సంబంధిత ఆప్షన్ ఎంచుకుని నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే చాలు ఓటరు జాబితాలో మీ పేరుంటే ఆ వివరాలు పోలింగ్ స్టేషన్, సీరియల్ నెంబర్ అన్నీ కన్పిస్తాయి.
ఇక మొబైల్ నెంబర్‌తో సెర్చ్ చేసేందుకు ఓటీపీ ధృవీకరించుకోవాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే చాలు అన్ని వివరాలు కన్పిస్తాయి. ఈ మూడు మార్గాల్లో ఎలాగైనా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఏప్రిల్ 15 వరకూ ఏపీలో ఓటర్ల నమోదుకు అవకాశముంటుంది.
Also read: POCO Smartphone: పోకో నుంచి మరో కొత్త ఫోన్, 6 జీబీ ర్యామ్, 5000 mAh బ్యాటరీతో కేవలం 7500 రూపాయలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook