రెండో భార్యతో ఉంటున్నాడనే కోపంతో భర్త మర్మంగాలు కోసేసిన భార్య
భర్తపై కోపంతో అతడి మర్మంగాలు కోసేసిన మొదటి భార్య
తనతోకన్నా రెండో భార్యతోనే అధిక సమయం గడుపుతున్నాడనే ఆగ్రహంతో మొదటి భార్య తన భర్త మర్మంగాలు కోసేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది. ముజఫర్ నగర్‌లోని మిమ్లానాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పెళ్లి కాకపోవడంతో ఆమెను ఒప్పించి మరో పెళ్లి చేసుకున్నాడు బాధితుడు. ముజఫర్ నగర్ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రెండో భార్యకు బిడ్డ పుట్టిన తర్వాత అతడు ఎక్కువ సమయం ఆమె వద్దే గడపడాన్ని జీర్ణించుకోలేని మొదటి భార్య బుధవారం తన వద్దకు వచ్చిన భర్త మర్మంగాలు కోసేసినట్టు తెలుస్తోంది.
బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.