విజయవాడ: ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నేతృత్వంలో 200 మంది ముస్లిం ప్రతినిధులు సోమవారం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నందుకు వారు ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో సంబంధాలు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు.  విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని.. అందుకే  ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నామని వివరణ ఇచ్చారు. బీజేపీ సంబంధాలు ఉన్నప్పడు కూడా ముస్లిం మనోభావాలను గౌరవిస్తూ వచ్చామని.. ఇప్పుడు.. ఎప్పుడూ ముస్లిం అభివృద్దికి తెలుగుదేశం కట్టుబడి ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు నోట మైనార్టీ రిజర్వేషన్ మాట
ముస్లిం ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషను నిలబెట్టుకోవల్సిన అవసరమందన్నారు. దీనికి కోసం న్యాయసాయం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని .. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం వధువులకు రూ.50 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. రంజాన్ తోఫా తో నుంచి విద్యార్ధుల స్కాలర్ షిప్ వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. విదేశీ చదువుల కోసం విద్యార్ధులకు రూ.10 లక్షల రుణ సహాయం అందిస్తున్నామని..   వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.  ముస్లిం సమాజంలో పేదరిల నిర్మాలన కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు. 


పదవులకు ఇది సమయం కాదు..
ముస్లిం ప్రతినిధుల ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతూ ఇది పదవులు ప్రకటించే సమయం కాదని..ఇప్పుడు ప్రకటిస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్నారు. సరైన సమయంలో ముస్లింలకు తగు ప్రాథాన్యమిస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిథ్యం లేని విషయం తెలిసిందే. మంత్రివర్గం నుంచి బీజేపీ సభ్యులు వైదొలిగిన నేపథ్యంలో పలువురు జలీల్ ఖాన్ తో పాటు పలువురు మంత్రులు మంత్రి పదువులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీనిపై ఇలా స్పందించిన్లు తెలుస్తోంది.