AP Flood: రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి ముసురు పట్టుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటి ఉధృతితో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లోంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఈక్రమంలో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేసింది. ఏమైనా ప్రమాదం వచ్చినా వెంటనే తమను సంప్రదించాలంటోంది. 


పోలవరం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యాక్ వాటర్‌తో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Also read:IND vs ENG: నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే..టీమిండియా తుది జట్టు ఇదే..!


Also read:Rains: దేశంలో వరుణుడి ప్రతాపం..వివిధ రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook