బెంగాల్ ప్రభుత్వం- సీబీఐ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఈ కేసుకు సంబంధించిన నివేదికను సీల్ట్ కవర్ లో కోర్టుకు అందించింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఐ వాదన..


ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్ని జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ శారద చిట్ ఫంట్ కుంభకోణంలో సీబీఐకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని వాదించారు.ఈ కుంభకోణం కేసులో సిట్ చీఫ్ గా సీపీ రాజీవ్ ఉన్నారు.. వారు సేకరించిన ఆధారాలు, దస్త్రాలు సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదని కోర్టు సమక్షంలో ప్రశ్నించారు. పలుమార్లు విచారణకు రావాలన్న సహకరించలేదని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు


రాష్ట్ర ప్రభుత్వ వాదన...


ఈ సందర్భంగా స్పందించిన త్రిసభ్య ధర్మాననం... విచారణకు ఎందుకు నిరాకరిస్తున్నారని బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది.  బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తూ సీబీఐ పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్ష సాధిస్తోందని.. సీబీఐ ద్వారా వేదింపులకు గురిచేయాలని ప్రయ్నతిస్తోందని వాదించారు. 


కోర్టు రియక్షన్


ఇరుపక్షాల వాదనలను విన్న చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. ఈ కేసులో సీపీ రాజీవ్ కుమార్ ను సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని అదేశాలు జారీ చేసింది. షిల్లాంగ్ సీబీఐ కార్యాలయంలో విచారణలో హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది.


 ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ  అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొంది. విచారణ పేరుతో ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దన్న సుప్రీంకోర్టు...సీపీ రాజీవ్ కుమార్ ను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది