General Naravane: తదుపరి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే?
General Naravane: భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే అధికారి ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణె ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
General M M Naravane: తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిద దళాదిపతి (సీడీఎఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం (General Bipin Rawat Dies In Helicopter Crash) పాలడవడం యావత్ భారతావనిని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణితో పాటు మరో పదకొండు మంది (ఆర్మీ అధికారులు, ఐఏఎఫ్ సిబ్బంది) కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఆ హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటన తర్వాత జనరల్ బిపిన్ రావత్ స్థానాన్ని భర్తీ చేసే అధికారి ఎవరనే విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణె (Army chief General M M Naravane) తదుపరి సీడీఎస్ కావచ్చనే అంచనాలు వస్తున్నాయి.
నరవాణెనే ఎందుకు?
2019 డిసెంబర్ 31 నుంచి జనరల్ ఎం.ఎం.నరవాణె ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. అయితే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ప్రస్తుత ఉన్నతాధికారులతో పోలిస్తే.. నరవాణెనే సీనియర్.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆ ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను స్వీకరించారు. ఆర్ హరి కుమార్ నేవీ చీఫ్ అడ్మైర్గా గత నెల 30న నియమితులయ్యారు. దీనితో నరవాణెనే తదుపరి సీడీఎస్‌గా (Next CDS of India) ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది నరవాణె రిటైర్మెంట్..
ఆర్మీ చీఫ్‌గా వచ్చే ఏడాది ఏప్రిలో నరవాణె పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే సవరించి ఆర్మీ నిబంధనల ప్రకారం.. సీడీఎస్ 65 ఏళ్లు వచ్చే వరకు సేవలందించే అవకాశముంది.
నిజానికి జనరల్ బిపిన్ రావత్.. సీడీఎస్ పదవి నుంచి కూడా వచ్చే ఏడాది రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. అంతలోనే ఆయన.. ప్రమాదంలో మృతి చెందటం వల్ల తదుపరి సీడీఎస్ ఎంపికపై ముందస్తుగా కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
సీడీఎస్ అంటే ఏమిటి?
ఆర్మీ, నేవీ, వాయు సేనల మధ్య సమన్వయం కుదిర్చేందుకు భారత ప్రభుత్వం సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) పదవిని సృష్టించింది భారత ప్రభుత్వం. 2019లో ఈ పదవికి ఆమోదం లభించగా.. అదే ఏడాది డిసెంబర్ 31న తొలి సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసింది. చాలా ఏళ్లుగా ఈ పదవిని సృష్టించే విషయంపై చర్చ సాగింది. ఇందుకోసం పలు కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి.
ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయిన నేపథ్యంలో తివిద దళాల్లో సీనియర్ అయిన జనరల్ బిపిన్ రావత్‌ను ఆ పదవికి ఎంపిక చేసింది ప్రభుత్వం. రావత్ రిటైర్ అయిన అనంతరం నరవాణె.. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
త్రివిద దళాల ఉన్నతాధికారులతో సమన్వయం కుదుర్చడం సహా అందరికన్నా ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నతాధికారిగా వ్యవహరిస్తారు సీడీఎస్. అయితే దళాల వారీగా మాత్రం వాటి అధిపతులకే పూర్తి అధికారాలు ఉంటాయి.
Also read: Bipin Rawat death news: సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మయన్మార్ మిషన్ వరకు.. బిపిన్ రావత్ కెరీర్ హైలైట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook