గుజరాత్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని వెజల్ పూర్‌లో ఏర్పాటు చేసిన 961వ పోలింగ్ బూత్‌లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ క్యూ లైన్‌లో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహసనలోని కాడి పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత జీవాభాయి పటేల్ పై నితిన్ పటేల్ పోటీ చేస్తున్నారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్ధిక్ పటేల్ విరామ్ గ్రామ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING