స్టేజ్‌పైనే గవర్నర్ నివేదిక చింపేసిన సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మధ్య మరోసారి వివాదం తలెత్తింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఢిల్లీలో సీసీటీవీ కెమెరాలపై లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన ఆదేశాల నివేదికను అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభలో స్టేజీపైనే అందరూ చూస్తుండగానే చింపేశారు. ప్రజలు తమ సొంత డబ్బుతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల నుంచి అనుమతి పొందాలని గవర్నర్ నివేదికలో పేర్కొనడంతో కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసి చింపేశారు. లైసెన్స్ అంటే ‘డబ్బులిచ్చి, లైసెన్స్ తీసుకోండి’ అని చెప్పడమేనని పేర్కొన్నారు. దీనిని చింపేయడం ప్రజల అభిమతమని చెప్పారు. బీజేపీ పార్టీ చెప్పినట్లుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ మరోసారి ఆరోపించారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.