ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హోం మంత్రి అమిత్ షాల మధ్య హీట్ డిబేట్
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య సోషల్ మీడియాలో మాటకు మాట పెరిగిపోయింది. ఉచిత వై-ఫై, విద్యార్థుల భద్రతకై పాఠశాలల్లో సీసీటీవి కెమెరాల ఆప్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలపై విమర్శించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య సోషల్ మీడియాలో మాటకు మాట పెరిగిపోయింది. ఉచిత వై-ఫై, విద్యార్థుల భద్రతకై పాఠశాలల్లో సీసీటీవి కెమెరాల ఆప్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలపై విమర్శించారు.
గురువారం రాత్రి ఢిల్లీ బీజేపీ, హోం మంత్రి అమిత్ షా పోస్ట్ చేసిన ట్వీట్‌లో ఢిల్లీ ముఖ్యమంతిని ఉటంకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం అందించే ఉచిత వై-ఫై సేవలను ఎంత శోధించినప్పటికీ తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని కానీ వై-ఫై రావడం లేదని అన్నారు.
కొన్ని గంటల తరువాత, కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఆప్ ప్రభుత్వం మొబైల్ ఫోన్ల కోసం ఉచిత ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసిందని హోం మంత్రి అమిత్ షాకు వివరిస్తూ .. "సర్ ... మేము ఉచిత వై-ఫైతో పాటు ఉచిత బ్యాటరీ ఛార్జింగ్‌ను కూడా ఏర్పాటు చేశామని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
గత ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక వాగ్దానం అయిన 1,041 ప్రభుత్వ పాఠశాలల్లో 1.2 లక్షల సీసీటీవి కెమెరాల ఏర్పాటుపై అమిత్ షా కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. కొన్ని కెమెరాలను మాత్రమే నామమాత్రంగా స్థాపించి, ప్రజలను మోసం చేస్తోందని" అన్నారు. .
ఢిల్లీలోని రెండు ప్రముఖ పార్టీల నాయకులు ఒకే ప్రాంతంలో ఎన్నికల ప్రచారం జరిగింది. మాటియాలాలో కేజ్రీవాల్ రోడ్‌షోతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా, హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభతో ముగించారు.
ఆప్ 2015 ఎన్నికలలో రికార్డు మెజారిటీ సాధించి, 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది. మరోసారి క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఢిల్లీలో 70 స్థానాలకు గాను ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి.
కేజ్రీవాల్ మరోసారి అధికారాన్ని నిలుపుకోవటానికి ఉచిత వై-ఫై, ఉచిత విద్యుత్ సరఫరా, నీటి రాయితీలతో సహా ప్రజాదరణ పొందిన పథకాలను అమలు చేస్తున్నారు. అత్యుత్తమ పాఠశాలలుగా మార్చడంలో అప్ చేసిన కృషిని, ఢిల్లీ వాసుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం వంటి పనులు తమకు లాభిస్తాయని భావిస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ వారం ప్రారంభంలో 10-పాయింట్ల గ్యారెంటీ కార్డును ప్రకటించారు. ఉచిత విద్యుత్తు సరఫరా, 24 గంటల తాగునీటి సరఫరా, ప్రతి విద్యార్థికి ప్రపంచ స్థాయినాణ్యమైన విద్య వంటి మరో ఏడూ వాగ్దానాలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..