CAA Full Details in Telugu: ఎన్నికల ప్రకటన వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో ఉన్నఫళంగా పౌరసత్వ సవరణ చట్టం-2019ను అమల్లోకి తీసుకురావడం యావత్‌ దేశాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న సీఏఏను ఆగమేఘాల మీద అమలు చేయడాన్ని యావత్ ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న చట్టాన్ని ఏకపక్షంగా ఎలా అమలు చేస్తారని నిలదీశారు. సీఏఏ అమలుపై ఏఐఎంఐఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ తదితర ప్రతిపక్షాలు స్పందించాయి. ప్రధాని మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ఈ చట్టం తీసుకురావడంతో ఒరిగిదేమిటని నిలదీశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: CAA Implement: మోదీ ప్రభుత్వం సంచలనం.. ఎన్నికల వేళ సీఏఏ అమలుకు నిర్ణయం


గాడ్సే ఆలోచన ఇది..
'సీఏఏ ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలని కోరుకునే గాడ్సే ఆలోచన ఇది. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతి భారతీయుడు నిరసన తప్ప మరో మార్గం లేదు'
- అసదుద్దీన్‌ ఒవైసీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ

Also Read: Chungreng Koren: 'మణిపూర్‌ మంటల్లో కాలుతుంది మోదీజీ ఒక్కసారి రండి' కన్నీళ్లతో చాంపియన్‌ విజ్ఞప్తి


అశాంతి కోరుకోవడం లేదు
'పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రజల పట్ల వివక్ష చూపిస్తే నేను దానిని వ్యతిరేకిస్తా. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలకు సున్నితమైన అంశం. లోక్‌సభ ఎన్నికలకు ముందు అశాంతి కోరుకోవడం లేదు'
- మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి.


అమలు చేయం
'పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మత విభజన చట్టం. ఇది కేరళలో అమలు చేయలేం.
- పినరయి విజయన్‌, కేరళ ముఖ్యమంత్రి,


ఏం లాభం?
'దేశంలోని పౌరులు జీవనోపాధి కోస బయటకు వెళ్లాల్సినప్పుడు ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం ఏం లాభం?
- అఖిలేశ్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు.


'డిసెంబర్‌ 2019లో పార్లమెంట్‌ ఆమోదించిన ఈ చట్టం నిబంధనలను మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత అమలు చేయడం వెనుక ఏం ఉద్దేశం ఉంది? ప్రతి అంశాన్ని హిందూ-ముస్లిం చేయడమే బీజేపీ లక్ష్యం'
- దిగ్విజయ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ.


'ఉన్నఫళంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడానికి నాలుగేళ్లు పట్టింది. లోక్‌సభ ఎన్నికల ముందర ఉద్దేశపూర్వకంగానే సీఏఏను అమలు చేశారు. ఇది ఎన్నికలే లక్ష్యంగా చేశారు. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ నిర్ణయం అమలు'
- జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter