Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్​ ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ తనకు కేటాయించిన 'Z' క్యాటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నాకు Z క్యాటగిరీ భద్రత వద్దు. మీతో సమానంగా A క్యాటగిరీ పౌరిడిగానే ఉండాలనుకుంటున్నా. నాపై కాల్పులు జరిపిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?'అని లోక్​ సభలో అసదుద్ధీన్​ ఒవైసీ పేర్కొన్నారు.


యూపీ ఎన్నికల్లో భాగంగా.. నిన్న (గురువారం) ఆయన మీరఠ్​లో ప్రచారం నిర్వహించి ఢిల్లీకి బయల్దేరిన ఒవైసీ కారుపై కార్పుల జరిగిన విషయం తెలిసింది. ఈదాడి నేపథ్యంలో కేంద్రం తక్షణమే స్పందించి.. ఆయకు రెండో అత్యంత పటిష్ఠమై భద్రత (Z)ను కల్పించాలని నిర్ణయించింది.


ఈ అంశంపై లోక్​సభలో మాట్లాడిన అసదుద్ధీన్​ ఒవైసీ. తన కారుపై కాల్పులు జరిపిన వారిని చూసి భయపడబోనని తెలిపారు. పేదలు సురక్షితంగా ఉన్నప్పుడే తానూ సురక్షితమని పేర్కొన్నారు.


ఇద్దరు అరెస్ట్​..


మీరఠ్​లోని కితౌద ప్రాంతంలో అసద్ కాన్వాయ్​పై కాల్పులు జరిగిన ఘటనలోలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు కూడా వెల్లడించారు. నిందుతుల్లో ఒకరిపై ఇది వరకే హత్యాయత్నం కేసు ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు.


Also read: UP Polls 2022: రాజకీయాలకు పాకిన 'పుష్ప' ఫీవర్... యూపీ ఎన్నికల కోసం 'శ్రీవల్లి' సాంగ్ ను వాడుకున్న కాంగ్రెస్..


Also read: Navjot Singh Sidhu: బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలనుకుంటున్నారు.. సిద్ధూ సంచలన వ్యాఖ్యలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook