Asaduddin Owaisi: రామ మందిరం భూమి పూజ.. అసదుద్దీన్ సంచలన ట్వీట్
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది. బాబ్రీ మసీద్, బాబ్రీ జిందా హై అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో ( Babri masjid) ఓ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఒవైసి.. '' బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, ఉంటుంది కూడా'' అనే అర్థం వచ్చేలా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also read: అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ.. హనుమాన్ గఢీలో ప్రత్యేక పూజలు
రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) నిర్ణయాన్ని సైతం గతంలో అసదుద్దీన్ ఒవైసి తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఆ భూమి పూజకు హాజరైతే.. యావత్ దేశానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అసదుద్దీన్ ఒవైసి అభిప్రాయపడ్డారు. Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకున్న ఇక్బాల్ ఎవరు ?
ఇదిలావుంటే, మరోవైపు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం (AIMPLB) రామ మందిరం భూమి పూజపై ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఆగస్టు 4న రాత్రి వేళ ఓ ట్వీట్ చేసిన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు.. ''బాబ్రీ మసీదు ఉండేదని.. ఎప్పుడూ ఉంటుంది కూడా'' అని అందులో పేర్కొంది. టర్కీలోని hagia sophia వివాదమే ఇందుకు చక్కటి ఉదాహరణ అని ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడింది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. బాధపడాల్సిన అవసరం లేదని ముస్లింలకు ధైర్యం చెబుతున్నట్టుగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ ట్వీట్ చేసింది. Also read: Ram temple: భూమి పూజకు 1,11,000 లడ్డూల తయారీ