Assam Former CM Tarun Gogoi passes away in Guwahati : న్యూఢిల్లీ: అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కురు వృద్ధుడు తరుణ్‌ గొగోయ్‌ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 25న కరోనావైరస్ (Coronavirus) బారినపడిన తరుణ్ గొగోయ్.. రెండు నెలలపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. డిశ్ఛార్జ్ అయిన వెంటనే ఆయన మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో నవంబర్ 2న గువాహటి వైద్య కళాశాలకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మల్టీ-ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో పరిస్థితి విషమించి మరణించినట్లు వైద్యులు, అస్సాం (Assam) ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఆయన మృతితో అస్సాం ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడుసార్లు ముఖ్యమంత్రిగా.. ఐదుసార్లు ఎంపీగా.. 
1936 ఏప్రిల్‌ 1న అస్సాంలోని రంగజన్‌ టీ ఎస్టేట్‌లో తరుణ్ గొగోయ్ జన్మించారు. తండ్రి కమలేశ్వర్‌ గొగోయ్‌ వైద్య నిపుణులు కాగా, తల్లి ఉషా గొగోయ్‌ కవయిత్రి. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడైన తరుణ్‌ గొగోయ్‌.. కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ప్రజాధరణ నేతగా ఎదిగారు. గొగోయ్ 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. పీవీ నరసింహారావు కేబినేట్‌లో కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత 2001, 2006, 2011లలో వరుసగా మూడుసార్లు అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. Also read: 
Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్


రాష్ట్రపతి, ప్రధాని, పలువురు ప్రముఖుల సంతాపం
గొగోయ్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పలువురు అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 
Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి